Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో ఆరోపణలు చేసిన విపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.
ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) మరో వివాదంలో చిక్కున్నారు. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలి. స్త్రీ జాతికి నేనొక్కిడినే దిక్కువుతానంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ పై మహిళా న్యాయవాదులు (Women lawyers) పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు హెవెన్ హోం సొసైటీ సభ్యులు సైతం ఆర్జీవీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెదకాకాని పోలీసు స్టేషన్ లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ (Paper Leak) సర్వ సాధారణంగా జరిగేవే అంటూ దీనిని తేలిగ్గా కొట్టి పారేసే ప్రయత్నం చేశారు.
iQoo Z7 5G:భారత మార్కెట్‌లో ఐక్యూ జెడ్ సిరీస్ (iQoo Z) నుంచి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. జెడ్ 7 5జీ మొబైల్ రాగా.. ఈ రోజు నుంచి అమెజాన్ (Amazon), ఐక్యూ ఈ స్టోర్స్‌లో (iqoo e stores) విక్రయాలు జరగనున్నాయి. రూ.20 వేల లోపు ఉన్న మొబైల్ ధర.. యువతకు నచ్చేలా డిజైన్ చేశారు.
నాటు నాటు పాట ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గౌరవానికి అమెరికాలోని న్యూజెర్సీ(New Jersey) వేదికైంది.ఈ సాంగ్ ఆస్కార్ గెలిచిన సందర్భాన్ని అమెరికాలోని టెస్లా కార్ (Tesla car) ఓనర్స్ డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేశారు. ఎడిసన్ సిటీలోని పార్కింగ్ ఏరియాలో తమ కార్లను పార్కు చేసిన వందలాది టెస్లా కార్ల ఓనర్స్.. నాటు నాటు పాట బీట్ కు తగ్గట్లు తమ కార్ల హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ తమ అభిమా...
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది.
ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) వసంత నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించమని ఆలయ అధికారులు తెలిపారు. రేపు(మార్చి 22) శ్రీ శోభక్రుత్ నామ (Sobhakrut Nama) సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. బుధవారం (మార్చి 22) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇంద్రకీల...
2021 కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ దేవీకులం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీపీఎం తరఫున రాజా గెలిచాడు. అయితే ఆయన హిందువు కాదని, క్రైస్తవుడు అని, ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పోటీ ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు.. దేవీకులం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, ఎమ్మెల్యే రాజా ఎన్నికపై అ...
Rk roja:ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ 3 సీట్లను (seats) గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని.. ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ నేత, మంత్రి రోజా (roja) స్పందించారు. 3 సీట్లు (seats) గెలిస్తే చాలా? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( GHMC ) పరిధిలో ఆశా వర్కర్ల (ASHA Workers) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్యారోగ్య శాఖ( Health Dept ) ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్( Hyderabad ) పరిధిలో 323, మేడ్చల్( Medchal )లో 974, రంగారెడ్డి( Rangareddy ) పరిధిలో 243 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్న...
తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం వద్ద ప్రగతి భవన్ (Pragati Bhavan) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ (ABVP)కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఓ సినీ నటి ఇంట్లో పని చేసే వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. అతడికి రూ.10 కోట్ల లాటరీ తగిలింది. అసోంకు చెందిన అల్బర్ట్ గిట్టా అనే వ్యక్తి కేరళలోని కొచ్చిలో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా అతను ఓరు ముట్టాసీ గధ ఫేమ్ రజనీ చాందీ అనే నటి ఇంట్లో గెస్ట్ వర్కర్ గా పని చేస్తున్నాడు. అతనికి లాటరీ కొనుగోలు చేసే అలవాటు ఉంది. ఆ అలవాటు అతనిని ఇప్పుడు కోటీశ్వరుడిని చేసింది.
Covid : దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
80 thousand cops:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.