»Another Rare Honor For The Song Natu Natu In America
Natu Natu song : అమెరికాలో నాటు నాటు’ పాటకు మరో అరుదైన గౌరవం
నాటు నాటు పాట ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గౌరవానికి అమెరికాలోని న్యూజెర్సీ(New Jersey) వేదికైంది.ఈ సాంగ్ ఆస్కార్ గెలిచిన సందర్భాన్ని అమెరికాలోని టెస్లా కార్ (Tesla car) ఓనర్స్ డిఫరెంట్గా సెలబ్రేట్ చేశారు. ఎడిసన్ సిటీలోని పార్కింగ్ ఏరియాలో తమ కార్లను పార్కు చేసిన వందలాది టెస్లా కార్ల ఓనర్స్.. నాటు నాటు పాట బీట్ కు తగ్గట్లు తమ కార్ల హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
దర్మక ధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలుపొందింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటింది. ఎమ్ఎమ్ కీరవాణి కంపోజ్ చేసిన ఈ నాటు నాటు పాటను(Natu Natu song) రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ(Kala Bhairava) ఆలపించగా.. బెస్ట్ ఒరిజినల్ కేటాగిరీలో (Best Original Category) ఈ సాంగ్ ఆస్కార్ అవార్డు (Oscar Award) సాధించింది. ఇక తాజాగా నాటు నాటు పాట ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గౌరవానికి అమెరికాలోని న్యూజెర్సీ(New Jersey) వేదికైంది.ఈ సాంగ్ ఆస్కార్ గెలిచిన సందర్భాన్ని అమెరికాలోని టెస్లా కార్ (Tesla car) ఓనర్స్ డిఫరెంట్గా సెలబ్రేట్ చేశారు. ఎడిసన్ సిటీలోని పార్కింగ్ ఏరియాలో తమ కార్లను పార్కు చేసిన వందలాది టెస్లా కార్ల ఓనర్స్.. నాటు నాటు పాట బీట్ కు తగ్గట్లు తమ కార్ల హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. నాటు నాటు పాట విషయానికి వస్తే..సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి చంద్రబోస్ (Chandra Bose)లిరిక్స్ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipliganj), కాలభైరవ నాటు నాటు పాటను ఆలపించారు. హీరోలు రామ్చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్లు స్టెప్టులేశారు. కీరవాణి (Keeravani) ట్యూన్ సెట్ చేశారు. ఇకపోతే నాటు నాటు పాట షూటింగ్ ఉక్రెయిన్ (Ukraine)దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారిక భవనం మరియిన్స్కీ ప్యాలెస్ ముందు జరిగింది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.