అన్నమయ్య: రాయచోటి మండలం మాసాపేటలో సర్వే నంబర్ 9,821లోని 5.83 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం సాయంత్రం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారని, ఇకపై అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీటీ వంశీ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RI, VROలు పాల్గొన్నారు.