TG: 2023లో ప్రజాపాలన ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2023లో తమ దగ్గర అధికార యాంత్రాంగం లేదు.. అవినీతి డబ్బు లేదన్నారు. తాము కమిట్మెంట్తో, మంచి చేయాలనే ఆలోచనలతో ప్రజల ముందుకు వచ్చాం కాబట్టే.. గెలిచామన్నారు. SC వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమం జరిగిందని.. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడారన్నారు.