ఎన్టీఆర్: చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో సోమవారం రాత్రి ముప్పాళ్ళమ్మ, అంకమ్మ తల్లి తిరుణాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామాల్లో పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.