పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కి సమయం దగ్గరకి వస్తుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ మార్చి 15న HYD యూసుఫ్ గూడ గ్రౌండ్స్‌లో జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్, థమన్ సంగీతం అందిస్తున్నారు.