NGKL: అచ్చంపేట మండలంలోని రైతుల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మండల కేంద్రంలోని రెండు ప్రధాన రైతు సేవా కేంద్రాల్లో యూరియా నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. DCMS రైతు సేవా కేంద్రంలో 270 బస్తాల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే హకా రైతు సేవా కేంద్రంలో కూడా 270 బస్తాల యూరియా నిల్వలు రైతులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.