KMM: మధిర మండలం మాటూరు రోడ్డులో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ శీలం శంకర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆర్టీసీ బస్సు, ట్రాక్టరు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.