T20 WC-2026 ఈ విజయంపై టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘వరుసగా రెండో T20 WC విజయంలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉంది. నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది. ఆ పదేళ్లలో 10 ICC టైటిల్స్ గెలవాలన్నదే నా లక్ష్యం. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవడం చాలా ఎమోషనల్. మ్యాచ్కి ముందే గెలుస్తామని మాకు తెలుసు. గెలుపు తప్ప మరో ఆలోచనే లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని అన్నాడు.