తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం వద్ద ప్రగతి భవన్ (Pragati Bhavan) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ (ABVP)కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం వద్ద ప్రగతి భవన్ (Pragati Bhavan) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ (ABVP)కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఏబీవీపీ కార్యకర్తలు పోలీసులను దాటుకుని రోడ్డు మీద పరుగులు తీశారు. ప్రగతి భవన్ గేటుకు సమీపంలో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు ఏబీవీపీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు (Police) అక్కడి నుంచి తరలించారు. ఇక, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు కోరుతున్నారు. టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో(Sitting Judge) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, ఏబీవీపీ (ABVP)కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్(Goshamahal) పోలీస్ స్టేషన్ కు తరలించారు.