• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Dehli liquor scam:ముగిసిన కవిత విచారణ.. 10 గంటలపాటు ప్రశ్నలు

Dehli liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ ముగిసింది. ఈ రోజు 10 గంటలపాటు సుధీర్ఘంగా ప్రశ్నించారు.

March 21, 2023 / 09:56 PM IST

Delhi Excise Policy Case: 10 గం.లుగా కవిత విచారణ, క్షణక్షణం ఉత్కంఠ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది.

March 21, 2023 / 09:19 PM IST

Amritpal Singh ఇలా తప్పించుకున్నాడు.. సీసీటీవీ ఫుటేజీ ఇదిగో..?

Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఎలా పారిపోయాడు. 50 నుంచి 100 పోలీసు వాహనాలతో వెంబడించగా కనిపించకుండా ఎలా వెళ్లిపోయాడు. హర్యానా హైకోర్టు (High court) కూడా పోలీసులకు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. సింగ్ పారిపోయిన ఘటనకు సంబంధించి ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఓ వీడియో ప్లే చేసింది.

March 21, 2023 / 09:08 PM IST

Wpl : ఆఖరి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుకు ఓటమే

భారత్ లో ఐపీఎల్ (IPL) తరహాలో అమ్మాయిల క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ (Wpl) ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న ప్రారంభమైన ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చివరి లీగ్ మ్యాచ్ లోనూ దారుణంగా ఆడింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడింది.

March 21, 2023 / 09:07 PM IST

Happy Ugadi అని విష్ చేసిన సీఎంలు జగన్, కేసీఆర్.. పవన్ కల్యాణ్ కూడా

Happy Ugadi:మరికొన్ని గంటల్లో తెలుగు లోగిళ్లకు కొత్త శోభ రానుంది. బుధవారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది (Ugadi) పండగ. ఫెస్టివల్ కోసం మహిళలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖులు విష్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు (cm), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

March 21, 2023 / 09:03 PM IST

Death Penalty in India: మరణశిక్షలో మానవీయ పద్ధతులను కోరిన సుప్రీం కోర్టు

కరడు గట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల పైన కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణ శిక్షను అమలు చేయడానికి మరి...

March 21, 2023 / 08:38 PM IST

Actress Hema : పోలీసులను ఆశ్రయించిన నటి హేమ. .యూట్యూబ్ చానళ్లపై ఫిర్యాదు

సినీ నటి హేమ (Actress Hema) ఇటీవల భర్తతో కలిసి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన స్నేహితులతో కలిసితనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై(YouTube channels) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ నటి హేమ (Actress Hema) ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న వీడియోలు, ఫొటోలను ఫేక్ తంబ్‌నెయిల్స్‌తో(Fake thumbnails) యూట్యూబ్‌లో పోస్ట్ చేశారని ఈ ఫిర్యాదులో హేమ (...

March 21, 2023 / 08:37 PM IST

skill scam:చంద్రబాబు స్కిల్ ప్రదర్శించారు: మంత్రి చెల్లుబోయిన వేణు

skill scam:విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu) ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (venu gopala krishna) ఫైరయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై భారీ దోపిడి జరిగిందని ఆరోపించారు. ఇందులో చంద్రబాబు (chandrababu) తన స్కిల్ ప్రదర్శించారని సెటైర్లు వేశారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు (chandrababu) ప్రధాన నిందితుడిగా చేర్చి.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

March 21, 2023 / 08:17 PM IST

AICC : ఆఫీస్‌ల ఆస్తి పన్ను కూడా కట్టలేని పరిస్థితి ఆ పార్టీది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పీసీసీ (PCC) ఆర్థిక సంక్షోభంలో పీసీసీ కూరుకుపోయింది.అది ఎంతలా అంటే.. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.. దీనికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraja) ఏఐసీసీకి రాసిన లేఖ సాక్షింగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి.. రాష్ట్ర...

March 21, 2023 / 08:11 PM IST

Average Salary Hike in India: సగటు వేతన పెంపు 10.2 శాతం

భారత్ లో ఉద్యోగుల వేతనాలు (Average Salary Hike in India) 2023 ఏడాదిలో సగటున 10.2 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రొఫెషనల్ సర్వీసులు అందించే సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) తెలిపింది. గత ఏడాది ఇది 10.4 శాతంగా ఉందని వెల్లడించింది.

March 21, 2023 / 07:53 PM IST

Telangana high courtలో మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు ఊరట

Telangana high court:మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థకు తెలంగాణహైకోర్టులో (Telangana high court) ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ఏపీ సీఐడీ (ap cid) ఇటీవల తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో మార్గదర్శి చైర్మన్ రామోజీరావు (ramoji rao), ఎండీ శైలాజా కిరణ్ (sailaja kiran) తెలంగాణ హైకోర్టును (high court) ఆశ్రయించారు.

March 21, 2023 / 07:49 PM IST

Nitin Gadkar : నితిన్ గడ్కరీకీ బెదిరింపు కాల్స్…. రూ.10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్

మహారాష్ట్రలోని నాగపూర్ (Nagpur) లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.తాను అడిగినట్లు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి (Gadkari) హాని తప్పదని కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. నాగ్‌పూర్‌లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది

March 21, 2023 / 07:31 PM IST

Roja Counter to TDP : టీడీపీ నేతలు పిచ్చెక్కిపోతున్నారు… మంత్రి రోజా..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీ నేతల్లో మంచి కిక్ ఇచ్చింది. ఆ ఆనందాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే... ఈ విషయం అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.అందుకే టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మంత్రి రోజా కూడా ఈ విషయంపై స్పందించారు.

March 21, 2023 / 07:29 PM IST

Delhi Excise Policy Case: 8 గం.లుగా కవిత విచారణ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ టీం.. 144 సెక్షన్‌తో ఉత్కంఠ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ అధికారులు ఎనిమిది గంటలుగా విచారిస్తున్నారు.

March 21, 2023 / 07:26 PM IST

Minister Amarnath : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై మంత్రి అమర్నాథ్ కామెంట్స్..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా... ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. ఎప్పుడో ఓసారి వచ్చే గెలుపును చూసి పొంగిపోవద్దని, వచ్చే జనరల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు వస్తాయని, రావాలని కోరుకోవడం దురాశేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్‌తో మంత్రి పోల్చిచెప్పారు.

March 21, 2023 / 07:19 PM IST