కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఎస్కార్ట్ హెలికాప్టర్(helicopter) బురద(mud)లో కూరుకుపోయింది. అయితే దానికి 100 మందికిపైగా సిబ్బందితోపాటు ఓ జేసీబీతోపైకి లేపారు.
కర్ణాటక ఎన్నికల(karnataka elections) ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ(pm modi) పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే రాయచూరు జిల్లా సింధనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ఎస్కార్ట్ హెలికాప్టర్(helicopter) ప్రమాదవశాత్తు బురద(mud)లో కూరుకుపోయింది.
ఆ క్రమంలో అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్(helicopter) ను పైకి లేవడానికి నానా తంటాలు పడ్డారు. 100 మందికి పైగా సిబ్బందితోపాటు జేసీబీతో దానిని పైకి లేపారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
మరోవైపు ప్రధాని పర్యటించాల్సిన ఆ ప్రాంతాన్ని ఎందుకు తనిఖీ చేయలేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు(officers) విచారణకు ఆదేశించారు. ఇంకోవైపు హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రాంతం పొలం కావడం వల్ల తడిగా ఉన్నందుకే కూరుకుపోయిందని తెలుస్తోంది.
ఈ నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(karnataka elections 2023) జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెలువడనున్నారు.