కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్‌పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చిందనే రాహుల్ వ్యాఖ్యపై.. పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ పై కేసు నమోదైంది. ఆ క్రమంలో మార్చి 23న సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు గాంధీకి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.