»Acid Attack On Woman Not Paying Loan Money On Time Krishna District Ap
Acid attack: అప్పు డబ్బులు ఇవ్వలేదని మహిళపై యాసిడ్ దాడి
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకపోతే బాధితులతోపాటు అప్పు ఇచ్చిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే పరిస్థితిని బట్టి కొంత మంది వాగ్వాదానికి దిగుతూ తమ రుణం తీర్చాలని కోరుతారు. ఇంకొంత మంది సున్నితంగా అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా తాను ఇచ్చిన డబ్బులు ఓ మహిళ సమాయానికి ఇవ్వలేదనే కారణంతో ఏకంగా యాసిడ్ దాడి(Acid attack) చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.
ఏపీలోని కృష్ణా జిల్లా(krishna district)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి సమయానికి ఇవ్వలేదనే కారణంతో ఓ వక్తి మహిళపై యాసిడ్ ఎటాక్(Acid attack) చేశాడు. అయితే రాముడు అనే వ్యక్తి దగ్గర కరుణ కుమారి అనే మహిళ 20 వేల రూపాయలు 5 రూపాయల వడ్డీకి రుణంగా తీసుకుంది. ఆ క్రమంలో తిరిగి చెల్లించడంలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది.
దీంతో డబ్బులు అప్పుగా ఇచ్చిన వ్యక్తి రాముడు కొన్ని నెలల నుంచి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడని కరుణ కుమారి ఆరోపించింది. అయితే తాజాగా ఆమె ఇంట్లో భర్త లేని సమయం చూసిన.. రాముడు ఆమెపై యాసిడ్ దాడి చేసి పారిపోయాడు. దీంతో ఆమె అరుపులు విన్న స్థానికులు తన ఇంట్లోకి చేరి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.