• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోజు రోజుకు దిగజారుతున్న ప్రయాణికుల సౌకర్యం

BDK: పాల్వంచ RTC బస్ స్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. చెట్ల కింద ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన బెంచ్‌లను తొలగించి ఎండలో పడేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండాకాలంలో ప్రయాణికులు చెట్ల నీడలో వేచి ఉండే సౌకర్యం పూర్తిగా లేకుండా పోయింది. కనీసం టూ వీలర్ కార్లు ఆపడానికి కూడా సౌకర్యం లేదన్నారు.

February 22, 2026 / 06:47 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి: ఘనపురం మండలం సోలిపురం గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోలిపురంలోని బాధిత కుటుంబాన్ని పరమర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని కుటుంబానికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో 9 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.7,63,198 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:44 AM IST

శ్రీశైలం భక్తులకు తప్పిన ప్రమాదం

AP: శ్రీశైలంలో భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. అక్కడ ఓ వీఐపీ కాటేజీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

February 22, 2026 / 06:43 AM IST

‘వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి’

శాసనమండలలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామిని అవమానించి అపచారం చేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ విమర్శించారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణం గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, ఆలయ సంప్రోక్షణ చేశారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 06:43 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

TPT: సైదాపురం నుంచి రాపూరు వెళ్లే దారిలో జగనన్నా లేఅవుట్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిందా లేదా మరో వాహనం వీరిని ఢీకొట్టిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 06:43 AM IST

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉదయం 8:30 కు రాష్ట్ర పండుగగా గుర్తింపు పోందిన రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గోననున్నారు. అనంతరం 11కు చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.

February 22, 2026 / 06:40 AM IST

ఇక ప్రొద్దుటూరుకు నాన్ స్టాప్ బస్సులు ఉండవు

KDP: జమ్మలమడుగు RTC డిపో నుంచి ప్రొద్దుటూరుకు 9 నాన్ స్టాప్, 3 పల్లెలకు సర్వీసులు ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి 12 సర్వీసులను పల్లె వెలుగు బస్సులు గా మారుస్తున్నట్లు డిపో మేనేజర్ సుబ్బమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈనెల 26 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:39 AM IST

మాల్ ప్రాక్టీస్‌లో.. 17 మంది డిబార్

KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరిగిన UG పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 17 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు ఉపకులపతి వెంకట బసవరావు నిన్న తెలిపారు.సెయింట్ జోసెఫ్, YMR సిద్ధార్థ కాలేజీల్లో ముగ్గురు, శ్రీ వైష్ణవి, శ్రీ రాఘవేంద్ర, సెయింట్ జోసెఫ్ ఉమెన్, YMR జీడీసీల్లో ఇద్దరు, నంద్యాల, డోన్ జీడీసీ, ఆలూరు వెంకటేశ్వర కాలేజీల్లో ఒక్కొక్కరు ఉన్నారు.

February 22, 2026 / 06:38 AM IST

చిలకలూరిపేట అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమీక్ష

PLD: చిలకలూరిపేట పట్టణ సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

February 22, 2026 / 06:38 AM IST

బ‌స్సు ఢీకొని వ్య‌క్తికి గాయాలు

VSP: ఆనందపురం మండలం బోయిపాలెం వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కొట్టా అప్పారావును ఆనందపురం నుంచి విశాఖ‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన రోడ్డుపై పడిపోవడంతో కుడి భుజం, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 06:37 AM IST

దొంగ వస్తువులు కొనుగోలు.. యజమాని అరెస్ట్

ADB: దొంగ వస్తువులు కొనుగోలు చేసిన ముజాహిద్ అనే స్క్రాప్ దుకాణ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోథ్ CI గురుస్వామి నిన్న తెలిపారు. దిగ్నూర్ గ్రామానికి చెందిన కొరెల్లి రామకృష్ణ అనే వ్యక్తి బోర్‌వెల్ పైపులను దొంగలించి ముజాహిద్‌కు అమ్మినట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 06:37 AM IST

నంబూరు-ఎర్రుపాలెం రైల్వే లైన్ పనుల్లో వేగం

GNTR: నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం యార్డ్ ఆధునీకరణ, పెద్దాపురం వరకు 3.52 కిలోమీటర్ల మేర కొత్త పట్టాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 36.2 కోట్ల వ్యయంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ అడుగుతో కొత్త రైల్వే లైన్ కల సాకారం దిశగా పనులు మరింత వేగవంతం కానున్నాయి.

February 22, 2026 / 06:36 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆనందబాబు ఆకస్మిక తనిఖీ

BPT: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.

February 22, 2026 / 06:35 AM IST

విజయనగరంలో నేటి చికెన్ ధరలు

విజయనగరంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹285కు, స్కిన్‌లెస్ ₹275కు, బోనెలెస్ ₹295 వరకు విక్రయించబడుతోంది. నాటు కోడి ధరలు మాత్రం ₹300 పైగా ఉన్నాయి. షాపుల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:35 AM IST