తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ ఎదురైంది. జాతీయా హరిత ట్రైబ్యునల్ (NGT) రాష్ట్రంపై ఏకంగా రూ.3,825 కోట్ల జరిమానాను విధించింది. ద్రవ, ఘన వ్యర్థాలను సరియైన క్రమంలో నిర్వహించనందుకు ఈ మేరకు ఫైన్ వేసింది. ఈ మొత్తం రెండు నెలల్లో ఆయా ఖాతాల్లో జమ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ది ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. దీంతోపాటు ఉన్న వ్యవస్థలను ఆధునీకరించుకోవాలని వెల్లడించింది.
దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యర్థాల నిర్వహణ అంశం 18 ఏళ్లు నిర్వహించిన సుప్రీంకోర్టు.. 2014 నుంచి ఈ బాధ్యతలు NGTకి అప్పగించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు రూల్స్ పాటించకపోవడంతో 2019 నుంచి ఆయా ప్రభుత్వాల సీఎస్‌లకు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేస్తునే ఉన్నారు. ఇప్పటికే 2019లో ఓసారి, 2020 ఫిబ్రవరిలో మరోసారి సీఎస్ హాజరు కావాలని ఎన్జీటీ పేర్కొంది.