టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది రాజకీయాల్లో తమ హవా చాటుతున్నారు. ఈ క్రమంలో నాగార్జున సైతం రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన జగన్ కి కాస్త క్లోజ్ గా ఉంటారు కాబట్టి.. వైసీపీలో చేరతారంటూ ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. కాగా తాజాగా ఈ వార్తలపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు.
ప్రతిసారి ఎన్నికలు వచ్చే సమయంలో తాను రాజకీయాలలోకి రాబోతున్నానంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఏమాత్రం చేయడం లేదని తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నానంటూ ఈ సందర్భంగా నాగార్జున పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా ద్వారా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాను రాజకీయాల గురించి, పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉన్న తనకి ఏదైనా పొలిటికల్ కథాంశంతో తెరకెక్కి సినిమా కనుక వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.