AP: శ్రీశైలంలో వాహన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు గాయపడ్డారు. ఆలయ టోల్గేట్ వద్ద వాహనం బ్రేక్ ఫెయిలై కూడలి వద్ద కొందరు కన్నడ భక్తులను ఢీకొడుతూ ముందుకు దూసుకెళ్లింది. గాయపడిన వారిని స్థానికులు శ్రీశైలం దేవస్థానం ఆస్ప్రతికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.