ఓ రాజకీయ నేత ఉచితంగా మద్యం సీసా, కోళ్లను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. క్వార్టర్ మందు సీసా, కోడి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు. తెలంగాణ వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
TRS నేత రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు కేటీఆర్ నెక్ట్ సీఎం కావాలని కూడా శ్రీహరి పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది హమాలీ కూలీలకు మద్యం, కోళ్లను అందించారు.