TV Actor Shalini:పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇదీ ఒకప్పటి మాట.. ఇప్పటి తరం మారింది. చిటికెలో నిర్ణయాలు తీసుకుంటారు. ఒకప్పుడు జంట విడిపోతున్నారంటే బాధ, దుఖ: ఉండేది. ఇప్పుడు విడిపోతున్న సరే గర్వంగా చెబుతున్నారు. తమిళ టీవీ నటి షాలిని ( Shalini) కూడా విడాకులు తీసుకున్నానోచ్.. అని పండగ చేసుకుంది.
షాలిని ( Shalini) టీవీ నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా.. షాలిని ( Shalini).. మల్లుమ్ మల్లరుమ్ సీరియల్తో మంచి గుర్తింపు పొందింది. జీ తమిళ్లో ప్రసారం అయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలో కూడా పాల్గొంది. ఇటీవల భర్తతో విడిపోయారు. కుంగిపోకుండా ఆనందంతో విడాకుల ఫోటోషూట్ చేసుకున్నారు. రెడ్ కలర్ డ్రెస్ ధరించి.. చేతిలో డైవొర్స్ అనే అక్షరాలు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు భర్తతో కలిసి ఉన్న ఫోటోను చించివేశారు.
రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. కొన్నేళ్ల తర్వాత విభేదాలు వచ్చాయి. కొన్నినెలల క్రితం షాలిని కోర్టును ఆశ్రయించింది. తాజాగా విడాకులు ఇవ్వడంతో.. ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫోటో షూట్ నిర్వహించి.. ఫోటోను సగానికి పైగా చించేసింది.
తనకు 99 సమస్యలు ఉన్నాయి.. భర్త ఒక్కటి కాదు అని రాసి ఉన్న బోర్డు పట్టుకుని ఫోటోలు దిగారు. ఫోటోలను ఇన్ స్టలో షేర్ చేశారు. విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి ఇది సందేశం కావాలి.. ఇష్టం లేని భాగస్వామి నుంచి విడిపోవడం మంచిది. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు అర్హులు.. మీ జీవితాలను చేతుల్లోకి తీసుకోండి. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వండి. విడాకులు తీసుకోవడం ఫెయిల్యూర్ కాదు. జీవితానికో మలుపు.. ఇది సానుకూల మార్పులకు దారితీస్తోంది. ఒంటరిగా ఉండాలంటే ధైర్యం కావాలి.. అలాంటి వారికి దీనిని అంకింత చేస్తున్నాను అని షాలిని ( Shalini) తెలిపారు.
ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ ఉమెన్ అని.. చాలా ధైర్యవంతురాలు అని.. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇక్కడ ఎవరికీ తెలియదు.. తప్పుగా మాట్లాడే వారి గురించి పట్టించుకోకండి అని మరికొందరు రాశారు.