Actress: బ్రేకప్ తర్వాత కూడా వేధిస్తున్నాడు.. హీరోయిన్ కామెంట్స్..!
హీరోయిన్లు ప్రేమలో పడటం..తర్వాత విడిపోవటం కామన్ అనే చెప్పవచ్చు. గతంలో నయనతార, త్రిష వంటి చాలా మంది నటీమణులు కూడా ఈ బ్రేకప్(Breakup) పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ లిస్టులో మరో నటి కూడా చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఈ రోజుల్లో ప్రేమించుకోవడం తర్వాత విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. పెళ్లి తర్వాత కూడా చాలా సింపుల్ గా విడిపోతున్నారు. ఈ జాబితాలోకే యువ నటి దర్శ గుప్తా(Dharsha Gupta) కూడా వస్తుంది. తొలుత బుల్లి తెరపై సందడి చేసిన ఈ బ్యూటీ తర్వాత కుక్ విత్ కొమాలి షోతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత.. సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది.
రుద్ర తాండవం, ఓ మై గోస్ట్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా(social media)లో తన ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తన క్లీవేజ్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ తన మాజీ ప్రియుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను గతంలో ఓ వ్యక్తి ని ప్రేమించానని, తర్వాత బ్రేకప్ అయ్యి విడిపోయామని చెప్పింది.
అయితే, అతను మాత్రం బ్రేకప్(Breakup) తర్వాత కూడా తానే కావాలని వేధిస్తున్నాడంటూ వాపోయింది. ప్రేమికుల మధ్య నమ్మకం చాలా ముఖ్యమని, అది లేని ప్రేమ ఎక్కువ కాలం నిలపడదని ఆమె పేర్కొంది. తన జీవితంలోకి వచ్చే వ్యక్తి కోటీశ్వరుడు కావాల్సిన అవసరంలేదని, గుడిసెలో ఉండేవాడైనా పర్వాలేదని చెప్పింది. అయితే, నిజాయితీ మాత్రం చాలా అసవరం అని చెప్పడం విశేషం.