»Notification For 1 78 Lakh Teacher Posts Soon Bihar
Teacher posts: 1.78 లక్షల టీచర్ పోస్టులు..త్వరలో నోటిఫికేషన్!
బిహార్(bihar) ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులకు(teacher posts) ఆమోదం తెలిపింది. విద్యాశాఖలోని పలు విభాగాల్లో 1.78 లక్షల ఉపాధ్యాయులను నియమించే ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ మంగళవారం ఓకే చెప్పింది.
బిహార్(bihar) ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకాలకు(teacher posts) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వ కేబినెట్ మంగళవారం విద్యా శాఖ కింద వివిధ కేటగిరీలలో 1,78,026 ఉపాధ్యాయ పోస్టులను( 1.78 lakh teacher posts) నియమించేందుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్(nitish kumar) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేబినెట్ ఆమోదించిన 18 ప్రతిపాదనల్లో ఇది ఒకటి కావడం విశేషం.
ఈ పోస్టులను బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ద్వారా నియమించాలని నిర్ణయించింది. స్థిర వేతనంపై ULBలు, PRIల ద్వారా నియామించనున్నారు. అయితే గత ప్రక్రియ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
హయ్యర్ సెకండరీ (11-12 తరగతి)లో 57,618 ఉపాధ్యాయుల పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అధికారులు తెలిపారు. 33,186 సెకండరీ (తరగతి 9-10), 1,785 (6-8 తరగతి), 85,477 ప్రాథమిక (1-5 తరగతి) విభాగాల్లో ఖాళీలు(vacancies) ఉన్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బీహార్ స్టేట్ స్కూల్ టీచర్స్ (రిక్రూట్మెంట్, బదిలీ, క్రమశిక్షణా చర్యలు, సర్వీస్ షరతులు) రూల్స్ 2023ని కేబినెట్(cabinet) ఆమోదించింది. కొత్త పాలసీ ప్రకారం వివిధ కేటగిరీల ఉపాధ్యాయులను నియమించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే కొత్త స్కేళ్లను నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో వారికి ఉపాధ్యాయుల నికర జీతం నెలకు రూ.35,000 నుంచి 51,000 వరకు ఉంటుంది.
మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం(air pollution) దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి 15 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని వాణిజ్య వాహనాల నిర్వహణను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని గయా, ముజఫర్‌పూర్‌లలో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు సెప్టెంబరు 30 అర్ధరాత్రి నుంచి ఈ రెండు జిల్లాల్లో డీజిల్‌తో నడిచే మూడు చక్రాల వాహనాలను నిషేధించాలన్న రవాణా శాఖ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.