Bihar: Another bridge collapsed.. Tenth incident in 15 days
Bihar: బీహార్లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. 15 రోజుల్లో దాదాపు పది వంతెనలు కూలిపోయాయి. తాజాగా ఓ వంతెన కూలిపోయింది. 24 గంటల వ్యవధిలో మూడో వంతెనది. సరన్ జిల్లాలోని బనియాపూర్లో గండకి నదిపై సరేయ పంచాయతీ పరిధిలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సరన్ జిల్లాలో ఉన్న గ్రామాలకు పొరుగున ఉన్న సివాన్ జిల్లాతో కలిపి ఈ వంతెన ఉంది. ఇది కూలడంతో రెండు జిల్లాలకు చెందిన అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెనను 15 ఏళ్ల కిందట నిర్మించారు.
వంతెన కూలడానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియదు. భారీ వర్షాల కారణంగానే కూలిపోయి ఉంటుందని అధికారులు తెలిపారు. సరన్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్, వంతెన కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బీహార్ రాష్ట్రంలో వంతెనలు కూలిపోతున్న ఘటనలు రోజురోజుకి ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పాత వంతెనల్నింటినీ తనిఖీ చేసి, వెంటనే మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశించారు.