Golmaal in ORR Lease Tenders: BJP MLA Raghunandan Rao
Golmaal in ORR Lease Tenders:ఓఆర్ఆర్ (ORR) లీజు టెండర్ల విషయంలో గోల్ మాల్ జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), మంత్రి కేటీఆర్ (ktr) స్నేహితులకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్ల విషయాన్ని తొలుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ (ktr) సన్నిహితులకు టెండర్లు దక్కాయని ఆయన అన్నారు.
టెండర్లలో అవకతవకలు జరిగాయని.. ఎక్కువ టెండర్ వేసిన కంపెనీకి లీజు కట్టబెట్టిన ప్రభుత్వం 16 రోజులపాటు బిడ్ను ఎందుకు బహిర్గతం చేయలేదని అడిగారు. ఇందులో ఏదో మతలబు దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కంపెనీ టెండర్ వేసిన మొత్తం కన్నా ప్రభుత్వం ఎక్కువ చెప్పిందని గుర్తుచేశారు.
ఐఆర్ఎల్ కంపెనీ రూ.7272 కోట్ల టెండర్లు వేసిందని.. టెండర్ ద్వారా రూ.7380 కోట్లు వస్తాయని ప్రభుత్వం చెప్పిందని రఘునందన్ (Raghunandan Rao) అడిగారు. బిడ్ వేసిన మొత్తం కన్నా ఐఆర్ఎల్ ఎందుకు ఎక్కువ ఇస్తోందని.. బిడ్ ఓపెన్ చేసిన తర్వాత బేరమాడి అదే కంపెనీకి అప్పగించారా అని ప్రశ్నించారు. ఈ నెల 11వ తేదీన ఓపెన్ చేసిన బిడ్ను 27వ తేదీ వరకు ఎందుకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.
ఇకనైనా టెండర్లను ప్రజల ముందు బహిర్గతం చేయాలని కోరారు. ఓఆర్ఆర్పై అధ్యయనం కోసం క్రిసిల్ సంస్థకు రూ.4 కోట్లు ఇచ్చారని రఘునందన్ (Raghunandan Rao) పేర్కొన్నారు. సంస్థ రిపోర్ట్ ప్రకారం టెండర్లను ఎందుకు పిలవలేదని అడిగారు. తర్వాత మజార్స్ అనే మరో కన్సల్టెన్సీ కంపెనీకి రూ.80 లక్షలు చెల్లించి అధ్యయనం చేయించారని తెలిపారు. సదరు కంపెనీ కట్, పేస్ట్ చేసిందని.. వీళ్ల రిపోర్ట్ మీదుగా టెండర్లు పిలిచారని ఆరోపించారు.