Football Skating World Cup Organized In Hyderabad:Minister Srinivas Goud
Football Skating World Cup:హైదరాబాద్‌లో ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ 2023 (Football Skating World Cup) నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. సిటీలో నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్కేటింగ్ ముందుకు వచ్చిందని వివరించారు. దీని గురించి క్యాంపు కార్యాలయంలో 15వ ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ ఫెడరేషన్ టర్కీ అధ్యక్షుడు మెగ్గి సల్మాన్ పౌర్, సహా అధ్యక్షురాలు జహ్రా అబ్దొలిహారందితో డిస్కష్ చేశామన్నారు.
హైదరాబాద్‌లో ఫుట్ బాల్ స్కేటింగ్ నిర్వహణకు సహకారం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. సిటీలో క్రీడ అంశాలతో స్పోర్ట్స్ హబ్‌గా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామని వివరించారు. 15 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నెలకొల్పామని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్టేడియాలు నిర్మిస్తున్నామని వివరించారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించడంలో దేశంలో రెండో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, షూటింగ్లో ఇషా సింగ్ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)తెలిపారు. కార్యక్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఫుట్ బాల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల నగేశ్, కార్యదర్శి దీపక్ కుమార్, కోశాధికారి ఖాదర్ పాల్గొన్నారు.