శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం త్రయోదశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం:ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇష్టదైవతను ఆరాధించాలి.
వృషభం:కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. విష్ణు నామస్మరణ చేయాలి.
మిథునం: మీ మీ పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో మార్పులు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాలకు కలిసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు పెరుగుతాయి. గణపతి స్తోత్రం పఠించాలి.
కర్కాటకం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సానుకూల నిర్ణయాలు ఉంటాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. శుభ కార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. దుర్గాదేవిని ఆరాధించాలి.
సింహం: ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కొత్త పనులు వాయిదా వేసుకోవాలి. బంధుమిత్రులతో విబేధాలు దూరమవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
కన్య:ఆర్థిక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆకస్మిక ఖర్చలు పెరుగుతాయి. కుటుంబం నుంచి షహకారం అందుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
తుల:ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ కలహాల నుంచి దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. లక్ష్మి అష్టోత్తరం చదవాలి.
వృశ్చికం: కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కలహాలు ఏర్పడకుండా అందరినీ కలుపుకుని వెళ్లాలి. కొన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు దక్కుతాయి. వినాయకుడి అష్టోత్తర శతనామావళి పఠించాలి.
ధనుస్సు: ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేస్తారు. పెండింగ్ లోని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆంజనేయ స్తోత్రం పఠించాలి.
మకరం:వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇష్టదైవాన్ని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.
కుంభం: బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళనకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే కొత్త పనులు వాయిదా వేసుకోవాలి. లలిత సహస్రనామ పారాయణం చేయాలి.
మీనం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ, ప్రతిభకు తగినట్టు గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ప్రయాణాలు మేలు చేస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.