Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 July 14th).. భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.
ఈ రోజు(2024 July 14th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మీరు చేసే పనులకు సమాజం నుంచి మంచి గౌరవం లభిస్తుంది. కుటుంబపరిస్థితుల పట్ల అసంతృప్తిగా ఉంటారు. మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తి అవుతుంది. విమర్శలు ఎదుర్కొంటారు.
వృషభం
విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఆందోళనలు ఉంటాయి. కుటుంబంలో మార్పును ఆశిస్తారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
మిథునం
తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా మెలగాలి. వ్యాపార రంగంలోని వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృధా ప్రయాణాలు అధికం. కుటుంబ విషయాల్లో అనాసక్తి కలుగుతుంది.
కర్కాటకం
ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వృథా డబ్బు ఖర్చు ఉంటుంది. విదేశయాన ప్రయత్నాలకు సఫలం అవుతాయి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి.
సింహం
కొత్త ఇంటి పనులపై శ్రద్ధ పెడుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. బంధు, మిత్రులతో కలిసి వింధులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం కలుగుతుంది. భక్తిశ్రద్ధలు పెరుగుతాయి. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
కన్య
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పులు తొలగిపోతాయి. సంఘంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా
తీసుకుంటారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుసుకుంటారు.
తుల
ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు. మొదలు పెట్టిన పనుల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తి అవడంతో ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి.
వృశ్చికం
మీ పరాక్రమాన్ని ఇతరులు గౌరవిస్తారు. శత్రుబాధలు ఉండవు. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. మిక్కిలి ధైర్య, సాహసాలతో నూతన పనులకు మొదలు పెడుతారు.
ధనుస్సు
ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. గొడవలకు తావివ్వరాదు. అనారోగ్య బాధలను అధిగమించడానికి వైద్యుల సలహాలు పాటించాలి. ఆస్తుల సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం
కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉండవు. మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. తద్వారా అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండాలి. అందరితో స్నేహంగా ఉండాలి.
కుంభం
కోరుకునేది ఒకటైతే జరిగేది ఇంకోటి. అనారోగ్య బాధలు ఉంటాయి. సమయం ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పెట్టరాదు.
మీనం
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సహనంవహించడం మంచిది. పరిస్థితిని చేజారనివ్వకండి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి.