»Kane Williamson Surgery Success Virat Kohli Hardik Pandya Wishes
Kane Williamson: సర్జరీ సక్సెస్..కోహ్లీ, పాండ్యా విషెస్
మోకాలి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కేన్ విలియమ్సన్(kane Williamson) రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతను గత నెలలో తన కుడి మోకాలికి సర్జరీ(surgery) చేయించుకున్నారు. ఈ క్రమంలో సర్జరీ విజయవంతమైనట్లు కేన్ పేర్కొనగా..విరాట్ సహా పలువురు స్పందించారు.
న్యూజిలాండ్ ప్రముఖ క్రికెటర్ కేన్ విలియమ్సన్(kane Williamson) మోకాలి శస్త్ర చికిత్స(surgery success) విజయవంతమైంది. అతను గత నెలలో తన కుడి మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ క్రికెటర్ ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి పూర్తిగా తొలగించబడ్డాడు. ఈ క్రమంలో తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలను విలియమ్సన్ తన అధికారిక Instagram ద్వారా పోస్ట్ చేశారు. తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలియజేశాడు.
ఇది చూసిన విరాట్ కోహ్లీ(virat Kohli) సహచర క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. “త్వరగా కోలుకో మై బ్రదర్” అని కోహ్లి కామెంట్ చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా(hardik Pandya)సైతం తన మద్దతు తెలియజేస్తూ ఫైర్ ఎమోజీలను యాడ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇది తెలిసిన మరికొంత మంది కేన్ అభిమానులు గేట్ విల్ సూన్, స్పీడ్ రికవరీ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో కేన్ భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఆడబోయే రాబోయే 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు విలియమ్సన్(Williamson) ఆడతడా లేదా అనేది తెలియాల్సి ఉంది.