»Pandya Divorce 70 Percent Of His Property To Natasha
Hardik Pandya: పాండ్యా డివోర్స్.. తన ఆస్తిలో 70 శాతం నటాషాకు?
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇవ్వబోతున్నాడా? విడాకుల తర్వాత భరణం కింద నటాషాకు తన ఆస్తిలో 70 శాతం వాటా హార్దిక్ ఇవ్వనున్నాడా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజమెంత? ఇంతకీ వారిద్దరికీ ఎక్కడ చెడింది అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Pandya divorce.. 70 percent of his property to Natasha?
Hardik Pandya: పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకి వెళ్లారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు.. విడాకుల తర్వాత భరణం కింద నటాషాకు హార్దిక్ తన ఆస్తిలో 70 శాతం వాటా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్, నటాషా విడాకులు తీసుకోవడానికి సరైన కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. అభిప్రాయ బేధాలతోనే వీళ్లిద్దరు విడిపోవాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
హార్ధిక్ పాండ్యా భార్య నటాషా … ఇటీవలే తన పేరులో పాండ్యా అనే పదాన్ని తన ఇన్‌స్టా బయో నుంచి తొలగించింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. వీరిద్దరూ కలిసి ఉండడం లేదని, విడిపోయారని నెటిజన్లు తీర్మానించేస్తున్నారు. పాండ్యాతో కలిసి దిగినే అనేక ఫోటోలను తన ఇన్‌స్టా ఎకౌంట్ నుంచి నటాషా తొలగించింది. పాండ్యా, నటాషా కలిసి లేరని చెప్పడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు భావిస్తున్నారు. తమ మధ్య ఉన్న ఈ విభేదాల కారణంగానే.. వీళ్లు చాలాకాలం నుంచి కలిసి కనిపించడం లేదు. చివరి సారిగా ఫిబ్రవరి 14న వీళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫోటోని షేర్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎలాంటి పోస్టులు షేర్ చేయలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగానూ నటాషా ఎక్కడా కనిపించలేదు. పాండ్యాపై అనేక విమర్శలు వచ్చిన సందర్భంలోనూ నటాషా స్పందించలేదు. పైగా.. నటాషా తన పేరులో నుంచి పాండ్యాను కూడా తొలగించింది. ఈ పరిణామాలే.. వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
ఇదిలా వుండగా.. హార్దిక్ పాండ్యాకు వడోదర, ముంబై ప్రాంతాల్లో ఆస్తులున్నాయి. ముంబైలో అతను రూ.30 కోట్లు పెట్టి ఒక అపార్ట్‌మెంట్‌ని తీసుకున్నాడు. వడోదరలో తీసుకున్న పెంట్ హౌస్ ఖరీదు కూడా కోట్లలోనే ఉంది. ఇక ఐపీఎల్లో అయితే ముంబై జట్టు నుంచి అతడు రూ.15 కోట్లు ఫీజుగా అందుకుంటున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు కూడా 15 కోట్ల రూపాయలు అందుకునే వాడు. ఈ ఆదాయానికి తోడుగా భారత జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నందకు కూడా హార్ధిక్ పాండ్యాకు కోట్లలోనే ఆదాయం వస్తోంది. వీటితో పాటు అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా పాండ్యా వ్యవహరిస్తున్నాడు.
గత కొన్ని నెలలుగా హార్దిక్ పాండ్యాకు కఠిన పరీక్షలు ఎదురౌతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాయే కారణమని కోట్లాది మంది అభిమానులు నిందిస్తున్నారు. పలు సోషల్ మీడియా వేదిక ద్వారా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముంబై జట్టు పతనానికి పాండ్యా అహంకార పూరిత ప్రవర్తనే కారణమని నిందిస్తున్నారు. అదే విధంగా అనేక మ్యాచుల్లో పాండ్యా తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఆ జట్టు కొంప ముంచాయని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో పాండ్యా వైవాహిక జీవితం కూడా తలక్రిందులయిందనే వార్త వెలుగు చూసింది. పాండ్యా భార్య నటాషా అతడి నుంచి దూరంగా ఉంటున్నాడని, విడాకులు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
హార్ధిక్ పాండ్యా, నటాషాలు 2020 మే నెలలో వివాహం చేసుకున్నారు. జూలై 30 నాటికి ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకి అగస్త్య అనే పేరు పెట్టారు. 2023లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. మొదటిసారి వివాహం చేసుకున్న సందర్భంగా కరోనా మహమ్మారి కారణంగా స్నేహితులు, బంధువులను ఎక్కువ మందిని పిలవలేకపోయారు. ఆ లోటు తీర్చుకునేందుకు మరోసారి ఘనంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయో ఎవరికీ తెలియదు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ సందర్భంగా జరిగిన ఒక్క మ్యాచ్‌లో కూడా నటాషా కనిపించకపోవడంతో అభిమానులకు అనుమానం కలిగింది. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై రీసెర్చ్ చేశారు. ఫిబ్రవరి తర్వాత నుంచి ఆమె చేస్తున్న పోస్టుల్లో హార్ధిక్ పాండ్యా గురించి ఒక్క పోస్టు కూడా లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. అక్కడి నుంచి ఒక్కో విషయం వెలుగుచూస్తోంది. వారిద్దరూ విడిపోయే వరకూ వచ్చారని నెటిజన్లు నిర్ధారించేశారు. విడాకులు కూడా తీసుకుంటున్నారని, పాండ్యా తన ఆస్తుల్లో 70 శాతం ఆస్తులను ఆమెకు ఇచ్చేయనున్నాడని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.