ఐపీఎల్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తం అందనుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకు కూడా కోట్లాది రూపాయలు ముట్టనున్నాయి. టోర్నీ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటి వరకు విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ పెరుగుతూ వస్తోంది.
IPL2024: 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఐపీఎల్ విజేత రాజస్థాన్ రాయల్స్‌కు 4.8 కోట్లు, రన్నరప్‌కు రూ. 2.4 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. టోర్నమెంట్ ఒక ప్రయోగాత్మక లీగ్‌గా ప్రారంభమైంది.. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన లీగ్‌లలో ఒకటిగా మారింది. కొన్నేళ్లుగా ప్రైజ్ మనీ కూడా చాలా రెట్లు పెరిగింది. ప్రస్తుత సీజన్ విషయానికొస్తే, బీసీసీఐ జట్లకు కేటాయించిన మొత్తం 46.5 కోట్ల రూపాయలు. ఈ మొత్తం అమౌంట్‌ని ఐపీఎల్ విజేతలు, రన్నరప్‌లతో పాటు ఆరెంజ్ క్యాప్ హోల్డర్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు పంపిణీ చేయనున్నారు.
ఐపీఎల్ 2024 విజేత రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంటుంది. ప్రస్తుత సీజన్ లో ఐపీఎల్ రన్నరప్ రూ.13 కోట్ల మొత్తాన్ని అందుకోనుంది. మూడు, నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ. 7 కోట్లు, రూ. 6.5 కోట్లు లభిస్తాయి. ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి 741 పరుగులతో టాప్ లో ఉన్నారు. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం దాదాపు ఖాయమైనట్టే. అలాగే, 24 వికెట్లు పడగొట్టిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆటగాళ్లు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందుకుంటారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రూ. 20 లక్షలు అందుకోగా, సీజన్‌లోని మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ రూ.12 లక్షలు అందుకుంటారు.