ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో మరికొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. తుది పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కోల్‌కతా , సన్రైజన్ జట్ల మధ్య బలాబలాలపై ఓ సారి లుక్కేద్దాం.
KKR va SRH: ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో మరికొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. తుది పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కోల్‌కతా , సన్రైజన్ జట్ల మధ్య బలాబలాలపై ఓ సారి లుక్కేద్దాం. కోల్‌కతా జట్టుకు ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూరమయ్యాడు. సాల్ట్ దూరమైనా ఆ లోటు లేకుండా.. రహ్మానుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ మంచి ఫామ్ మీదున్నాడు. వీరిద్దరితో పాటు వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ మరోసారి చెలరేగితే ఫైనల్ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. వీరందరితో పాటు రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్ కూడా బ్యాట్ .. జులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాతిక కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు వికెట్ల వేటలో ముందుంటారని అనడంలో సందేహం లేదు. వీరితో పాటు మరో ఇద్దరు బౌలర్లు.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు కూడా బాగానే రాణిస్తున్నారు. సరైన సమయంలో వికెట్లు తీస్తూ…. జట్టుకు అండగా నిలుస్తున్నారు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే… ఆ జట్టు పడుతూ లేస్తూ వస్తోంది. గత కొన్ని మ్యాచుల్లో ఓపెనింగ్ ఇబ్బందిగా మారింది. దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు త్వరగా పెవిలియన్‌కు చేరుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. క్వాలిఫయర్ 2లో ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ రాణించారు. తుది మ్యాచ్‌లో కూడా వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ ఇటీవల కాలంలో భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లోనైనా వీరిద్దరూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. షాబాజ్ అహ్మద్ కూడా ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. పాట్ కమిన్స్ , భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. అవసరం అనుకుంటే షాబాజ్ అహ్మద్‌తో పాటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కూడా బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. మొత్తంగా చూస్తే… ఏ టీమైతే ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని ఆడుతుందో…. ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఈ విషయంలో పాట్ కమిన్స్ ఒక్క అడుగు ముందే ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఆసీస్ ప్లేయర్ వరల్డ్ కప్ సందర్భంగా తన జట్టును విజేతగా నిలపడంలో ఎంతో తెలివిని కనబరిచాడు. సన్‌రైజర్స్ జట్టు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టును ఓ క్రమ పద్దతిలో పెట్టాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా అంతే తెలివిగా ప్రవర్తించి, ప్రత్యర్ధిని కట్టడి చేసే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.