»Srhvskkr The Final Battle Who Will Win What Are The Analysts Saying
SRHvsKKR: తుది పోరు.. గెలిచేది ఎవరు? విశ్లేషకులు ఏం చెబుతున్నారు.
ఐపీఎల్ టోర్నీ విజేతలు ఎవరనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది. గత ఈ మ్యాచ్‌లో ఎవరైతే ఒత్తిడిని జయించి ఆడగలరో వారే విజేతలుగా మారే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం ఖచ్చితంగా అంచనా వేస్తున్నారు. ఇరు జట్లలోని బలాబలాలను విశ్లేషిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ ఈ సీజన్ ఐపీఎల్ విజేత ఎవరో తేల్చి చెప్పారు. ఇంతకీ వారిద్దరూ ఏ జట్టు గెలుస్తుందని చెప్పారో తెలుసా? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
SRHvsKKR: The Final Battle.. Who Will Win? What are the analysts saying?
SRHvsKKR: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న కోల్‌కతా నిలకడగా రాణిస్తూ ఫైనల్ వరకూ చేరింది. మరోవైపు సన్‌రైజర్స్ జట్టు పడుతూ లేస్తూ ఫైనల్ చేరింది. ప్రస్తుతం ఇరు జట్లు పటిష్టంగా ఉన్నాయి. రెండు జట్లలో ఏదో ఒక జట్టే విజేతగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజనాలు అనిల్ కుంబ్లే, షేన్ వాట్సన్‌లు తమ అభిప్రాయాలను ఎటువంటి సంకోచం లేకుండా వెల్లడించారు. తుదిపోరులో కోల్‌కతా జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని అనిల్ కుంబ్లే అభిప్రాయపడుతున్నాడు. కేకేఆర్ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని అనిల్ కుంబ్లే చెబుతున్నాడు.
మరోవైపు షేన్ వాట్సన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. కేకేఆర్ జట్టు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, అదే ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింటని వాట్సన్ అభిప్రాయపడుతున్నాడు. క్వాలిఫయర్ 1 మ్యాచ్ తర్వాత … కేకేఆర్ జట్టుకు పూర్తిస్థాయిలో విశ్రాంతి లభించింది. దాదాపుగా ఐదు రోజుల విశ్రాంతి తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగనున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అటువంటి పటిష్టమైన జట్టును ఓడించడం సన్‌రైజర్స్ జట్టుకు సాధ్యం కాకపోవచ్చని వాట్సన్ విశ్లేషించాడు.
తుది పోరులో పరుగులు వరద పారే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 8 సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఫైనల్లో ఆడుతున్న రెండు జట్లు భారీ స్కోర్లను చేశాయి. సన్‌రైజర్స్ జట్టు మూడు సార్లు చేయగా… కేకేఆర్ జట్టు రెండు మ్యాచుల్లో 250 ప్లస్ స్కోర్లు చేసింది. పవర్ ప్లేలో ఏవిధంగా ఆడాలనే విషయం ఈ రెండు జట్లకు బాగా తెలుసని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. కేకేఆర్ జట్టు సారధి శ్రేయాస్ అయ్యార్ అద్భుతంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎప్పుడు ఉపయోగించుకోవాలో అనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు. సునీల్ నరైన్‌తో పాటు రింకూసింగ్, వెంకటేశ్ అయ్యార్, మిచెల్ స్టార్క్ వంటి ప్లేయర్లు ఆ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చారు. ఆండ్రూ రస్సెల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ సీజన్లో బాగా రాణించాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా కూడా ఫైనల్ విషయంలో తన అభిప్రాయం వెల్లడించాడు.
ఇరు జట్లు ఆడే 8 ఓవర్ల స్పిన్ బౌలింగ్ అనేది చాలా కీలకం కానుందని అన్నాడు. స్పిన్నర్లు వేసే బౌలింగ్ మీదే ఇరు జట్లు విజయావకాశాలు ఉంటాయని రైనా తెలిపాడు. దీనితో పాటు సన్‌రైజర్స్ జట్టు సారధి ప్యాట్ కమిన్స్‌పై… సురేశ్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచకప్ అందించిన అనుభవం కలిగిన ప్యాట్ కమిన్స్ …ఐపీఎల్ ఫైనల్లో కూడా తన అనుభవాన్ని రంగరించి జట్టును గెలిపించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని రైనా అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్ కు ఖచ్చితమైన స్ట్రాటజీలు, వాటిని అమలు పరిచే విధానాలు తెలుసని రైనా అభిప్రాయపడ్డాడు. 2018లో ఫైనల్స్‌లో చెన్నైతో తలపడిన హైదరాబాద్ జట్టు ఓటమి పాలయింది. ఆరేళ్ల తర్వాత మరోసారి ఫైనల్ ఆడుతోంది. మరోవైపు కోల్‌కతా జట్టు పదేళ్ల తర్వాత ఫైనల్లో ప్రవేశించింది. 2014లో గౌతమ్ గంభీర్ సారధిగా ఉన్న సమయంలో కేకేఆర్ జట్టు ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. పదేళ్ల తర్వాత మరోసారి ఫైనల్ చేరింది. ఈ అరుదైన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.