ఇండియా క్రికెట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన భార్యతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంత ఆయన భార్య నటాషా తన కొడుకుతో సెర్బియాకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
Divorce rumours.. Hardik Pandya's wife Natasha who went to Serbia with her son
Natasa Stankovic: భారత క్రికెటర్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన భార్యతో విడుకాలు తీసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై నెట్టింట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య భార్య నటాషా స్టాంకోవిచ్(Natasa Stankovic) తన కొడుకుతో సెర్బియా వెళ్లినట్లు తెలుస్తుంది. తాను ఎయిర్పోర్టులో కొడుకుతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే హర్ధిక్ సైతం త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ ఆడటం లేదని తెలుస్తుంది. వ్యక్తిగత కారణంగానే లంకతో వన్డేలకు దూరం ఉంటున్నానని బీసీసీఐకి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో నటాషా తన కొడుకు అగస్త్యను తీసుకొని ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లినట్లు సమాచారం.
నటాషా ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు తన ఇన్స్టారీల్స్లో షేర్ చేసుకుంది. అంతే కాకుండా బుధవారం తెల్లవారుజామున ముంబయి విమానాశ్రయంలో తన కొడుకుతో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే నటాషా ఓ ఫోటోను తన ఇన్స్టా స్టోరీలో పోస్టు చేస్తూ.. ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ కన్నీళ్లతో కూడిన ఎమోజీ, విమానం, ఇల్లు, హార్ట్ సింబల్ ఎమోజీని పంచుకుంది. కొంత కాలంగా వీరిద్దరు విడిపోతున్నట్లు వస్తున్న వార్తల గురించి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడమే వీరి విడాకులకు కారణం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నటాషాతో విడిపోవడానికే హార్దిక్ శ్రీలంకతో వన్డే సీరీస్కు దూరంగా ఉంటున్నట్లు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. వన్డే సిరీస్ల కంటే ముందు టీ20 సిరీస్లో హార్దిక్ ఆడునున్నారు.