»Ipl 2024 Where Is Hardik Pandya What Is The Situation Of Sunrisers
IPL 2024: హర్దిక్ పాండ్య ఎటువైపు.. సన్ రైజర్స్ పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2024 లీగ్ కోసం జట్లు తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, వేలంలోకి వదిలేసే ప్రక్రియ ఈ సాయంత్రంతో ముగిసింది. దీంతో ఏ జట్లో ఎవరు ఉన్నారో క్లారిటీ వచ్చింది. సన్ రైజర్స్ భారీగా ఆటగాళ్లను విడుదల చేసింది. అందులో ఖరీదైన ఆటగాడు కూడా ఉండడం విశేషం.
IPL 2024.. Where is Hardik Pandya.. What is the situation of Sunrisers?
IPL 2024: ఐపీఎల్-2024 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఆటగాళ్లను విడుదల చేయడం, అట్టిపెట్టుకోవడం ప్రక్రియ ఈ సాయంత్రంతో ముగిసింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya)ను గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అట్టిపెట్టుకుంది. తాజా సీజన్ లోనూ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. కొంత కాలంగా హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్(Mumbai Indians) కొనుగోలు చేయనుందంటూ ప్రచారం జరిగింది. పాండ్యాను రిలీజ్ చేసేందుకు గుజరాత్ ఫ్రాంచైజీకి ఏకంగా రూ.15 కోట్లు చెల్లించేందుకు ముంబయి ఇండియన్స్ సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. వాటిన్నింటికి తెరదించుతూ.. తమ నాయకుడు హర్దిక్ పాండ్యానే అని గుజరాత్ టైటాన్స్ స్పష్టం చేసింది.
గత సీజన్ లో ఘోర వైఫల్యం చెందిన సన్ రైజర్స్(Sunrisers) హైదరాబాద్ ఈసారి బలమైన జట్టును కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను విడుదల చేసింది. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brooke)ను రిలీజ్ చేసింది. సెంచరీల మోత మోగించిన బ్రూక్ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, బ్రూక్ తన రేటుకు తగిన న్యాయం చేయలేదు. తరువాత అదీల్ రషీద్ (ఇంగ్లండ్), అకీల్ హోసీన్ (వెస్టిండీస్), కార్తీక్ త్యాగి, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మలను కూడా సన్ రైజర్స్ విడుదల చేసింది. ప్రస్తుతం కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, మార్కో యన్సెన్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఫజల్ హక్ ఫరూఖీ, ఉపేంద్ర సింగ్ యాదవ్, సన్వీర్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అట్టిపెట్టుకుంది.