»T20 World Cup Hardik Pandyas Photo Should Be Deleted
T20 World Cup: హార్దిక్ పాండ్య ఫోటో తొలగించాలి
టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి లీగ్ ప్రారంభం కానుంది. జూన్ 9వ తేదీ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్కాస్ట్ షేర్ చేసిన ఫోటో వివదాస్పదమైంది. దీంతో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
T20 World Cup.. Hardik Pandya's photo should be deleted
T20 World Cup: క్రికెట్ అభిమానులు ఇష్టపడే టోర్నీలో టీ20(T20 World Cup) కూడా ఉంటుంది. ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. జూన్ 9న భారత్- పాకిస్థాన్(Pak vs Ind) మ్యాచ్ జరుగుతుంది. అందుకని హార్దిక్ పాండ్య(Hardik pandya), పాకిస్థాన్ కెప్టెన్ షహీన్ ఇద్దరు పక్క పక్క ఉండే ఫోటోలను విడుదల చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంవత్సరం యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని టీమ్ ఇండియా లీగ్ మ్యాచ్‌లు అన్ని అమెరికాలోనే జరుగుతాయి. దీంతో స్టార్ స్పోర్ట్స్ దాయాదుల పోరుకు సంబంధించి హార్దిక్ పాండ్య, షహీన్ ఫొటోలతో ఇమేజ్ను షేర్ చేసింది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ జట్టు తమ టీ20 జట్టుకు కెప్టెన్‌గా షహీన్‌ను ప్రకటించింది. కానీ ఇంకా టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరనేది ప్రకటించలేదు. అలటప్పుడు హార్దిక్ పాండ్య ఫొటోను ఎలా వాడతారని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. వెంటనే ఫోటో తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక రోహితే(Rohith Sharma) కెప్టెన్సీని కొనసాగించాలని కోరుతున్నారు.
It's the game we've all been waiting for! 🤯#TeamIndia takes on #Pakistan in the #T20WorldCup2024 in New York! 🗽 It can't get any better than this! 😍