»Formula E Race E Formula Race To Be Held In Hyderabad Has Been Cancelled
Formula E race: హైదరాబాద్‌లో జరగాల్సిన ఈ-ఫార్ములా రేస్ రద్దు
హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్ రద్దు అయ్యింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలుగవ రౌండ్ ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులు ప్రకటించారు.
Formula E race: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్ రద్దు అయ్యింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలుగవ రౌండ్ ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 30వ తేదీ జరిగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసింది. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఎఫ్ఈవో తెలిపింది.
గత ప్రభుత్వం, ఫార్ములా ఈ-రేస్ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం తమను నిరాశపరిచినట్లు ఫార్ములా ఈ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్టో లాంగో తెలిపారు. భారత్‌లో మోటర్‌స్పోర్ట్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. వరల్డ్ ఛాంపియన్షిప్ రేస్ ఈవెంట్‌ను హైదరాబాద్ నిర్వహించడం కీలకమైంది. కానీ తెలంగాణలో నిర్వహించలేకపోతున్నట్లు తెలిపారు.