»Sandeep Reddy Vanga Arjun Reddys Story Has To Do With Allu Arjun
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కథ అల్లు అర్జున్తో చేయాల్సింది
అల్లు అర్జున్ తో ముందే ఓ కథ చెప్పాను కొన్ని కారణాల వలన అది సెట్ అవలేదు. ఆ తరువాత అర్జున్ రెడ్డి ఆయనో చెద్దామనుకున్నా అది కుదరలేదు అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వివరించారు.
Sandeep Reddy Vanga Arjun Reddy's story has to do with Allu Arjun
Sandeep Reddy Vanga: టాలీవుడ్ ఇంటెన్సీవ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) అంటే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఉంది. తన మొదటి సినిమా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ వంగా కలయికలో అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క సినిమా ఇద్దరి కెరియర్లకు చాలా ఉపయోగపడింది. తాజాగా దీని గురించి సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన ఫారెన్ లో ఫిల్మ్ కోర్స్ ముగించుకొని కేడీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అల్లు అర్జున్(Allu Arjun) కోసం ఒక కథ రాసుకున్నారట. దాన్ని 2011లో ఆయనకు కథ చెప్పానని, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని సందీప్ తెలిపారు.
తర్వాత అర్జున్ రెడ్డి కథ రాస్తున్నప్పుడు బన్నీకి వినిపించాలని ఉండేది, కానీ ఆయనను కలవడం కుదరలేదని చెప్పారు. దాంతో ఆ స్క్రిప్ట్ ను పట్టుకుని చాలా మంది నిర్మాతలను కలిశానని, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదని వివరించారు. ఇక చేసేది ఏమి లేక తానే నిర్మించానని చెప్పారు. ఒక స్నేహితుడి ద్వారా విజయ్ దేవరకొండ పరిచయంతో అర్జున్ రెడ్డి తెరకెక్కిందని వెల్లడించారు. అప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేయడం కుదరలేదు కానీ 13 ఏళ్ల తర్వాత ఆయనతో సినిమాను తీసే అవకాశం వచ్చిందని సందీప్ చెప్పారు. ఇక ప్రభాస్ స్పిరిట్(Spirit) స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు, ఈ ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపారు.