»Eagle The New Release Date Of Eagle Which Is Scaring The Fans
Eagle: ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ‘ఈగల్’ కొత్త రిలీజ్ డేట్!
అనుకున్నదే జరిగింది. సంక్రాంతి రేసు నుంచి ఎవరు వెనక్కి తగ్గుతారని అనుకుంటే.. మాస్ మహారాజా ఈగల్ సినిమాను వాయిదా వేసుకొని మంచి పని చేశాడు. అయితే రవితేజ చేసింది మంచే అయినా.. నెక్స్ట్ లాక్ చేసిన కొత్త్ డేట్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ భయపడుతున్నారు.
Eagle: ఈ ఏడాది సంక్రాంతి సినిమాలా జాతర గట్టిగా ఉండబోతోంది. ఈసారి ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. దీంతో థియేటర్లో కొరత ఏర్పడింది. దీంతో మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ సినిమా వాయిదా పడింది. సంక్రాంతికి గుంటూరు కారంతో మహేష్ బాబు, సైంధవ్‌తో వెంకటేష్, నా సామీ రంగాతో నాగార్జున, ఈగల్తో రవితేజ పోటీపడుతుండగా.. ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఐదు సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే.. థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ వెనకడుగు వేసింది.
జనవరి 13న ఈగల్ రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా వేశారు. ప్రొడ్యూసర్స్ రవితేజని కలిసి ఈగల్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. జనవరి 13 నుంచి జనవరి 26కి ఈగల్ వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు.. కానీ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 9కి వాయిదా పడింది ఈగల్. ఇదే ఇప్పుడు రవితేజ అభిమానులను భయపడుతోంది. ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన రవితేజ సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవలేదు. గతంలో ఫిబ్రవరి 9న ‘షాక్’ , ఫిబ్రవరి 2న ‘నిప్పు’, ఫిబ్రవరి 2న ‘టచ్ చేసి చూడు’, ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
వీటిలో ఒక్క సినిమా కూడా రవితేజకి హిట్ ఇవ్వలేకపోయాయి. దీంతో సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయి ఫ్లాప్ నెలకు ఈగల్ పోస్ట్‌పోన్ చేయమేంటని.. మాస్ రాజా ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను వీలైతే ఇదే నెలలో రిలీజ్ చేస్తే బెటర్.. లేదంటే మరో కొత్త డేట్‌కి షిఫ్ట్ అవండని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే.. ఇప్పటికే లేట్ అయిన ఈగల్ ఫిబ్రవరి 9న రావడం పక్కా. అయినా.. కంటెంట్ బలంగా ఉండాలి కానీ.. ఇలాంటి బ్యాడ్ సెంటిమెట్లు పెద్దగా వర్కౌట్ కావు.