ఈసారి గుంటూరు కారం ఘాటు మామూలుగా ఉండదంటూ.. దాదాపు 13 ఏళ్ల తర్వాత కలిసి వస్తున్నారు మహేష్ బాబు, త్రివిక్రమ్. అతడు, ఖలేజా తర్వాత 13 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చారు మేకర్స్.
Guntur Kaaram: అతడు, ఖలేజా తర్వాత ఏకంగా కుర్చీని మడతపెట్టి అంటు వస్తున్నారు మహేష్ బాబు, త్రివిక్రమ్. ఇప్పటికే గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్ చేసుకోగా.. యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. రన్ టైమ్ వచ్చేసి 159 నిమిషాలుగా లాక్ చేశారు. ఇది అతడు, ఖలేజా కంటే తక్కువ రన్ టైమ్ కావడం గమనార్హం. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే గుంటూరు కారం హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకుంది.
వరల్డ్‌వైడ్ 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ జరగ్గా.. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 120 కోట్లుగా ఉంది. దీంతో గుంటూరు కారం పై భారీ అంచనాలున్నాయి. జనవరి 12న గుంటూరు కారం సినిమా భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో.. జనవరి 6న గ్రాండ్‌గా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ రెడీ అయ్యారు. దీంతో ఈ ఈవెంట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరో 24 గంటల్లో హైదరాబాద్‌లో ఈవెంట్ ఉంటుందని అనుకుంటే.. ఊహించని విధంగా ఈవెంట్ పోస్ట్‌పోన్ అయినట్టుగా తెలిపారు మేకర్స్.
‘మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, ఊహించని పరిస్థితులు మరియు భద్రతా అనుమతుల సమస్యల కారణంగా, 6 జనవరి 2024న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడం లేదు. ఈ ప్రకటనకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. ఈవెంట్ కోసం కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని.. చెప్పుకొచ్చారు. దీంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడుంటుంది? అసలు ఉంటుందా? అనేది తెలియకుండా పోయింది.