ఈసారి మన టిల్లుగాడు చేయబోయే రచ్చ మామూలుగా ఉండదని చెబుతునే ఉన్నారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ మాత్రం మారుతునే ఉంది. ఇక ఇప్పుడు రవితేజ కారణంగా మరోసారి టిల్లు స్క్వేర్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది.
Dj Tillu Sqaure: టిల్లు గాడు ఒక్కడే ఉన్నాడు.. కానీ సీక్వెల్లో డైరెక్టర్ మారిపోయాడు, హీరోయిన్ కూడా మారిపోయింది. టిల్లు స్క్వేర్ టైటిల్‌తో రానున్న డీజె టిల్లు సీక్వెల్లో రాధికా ప్లేస్‌లో క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ నటిస్తుండగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది.
టిల్లుగాడిపై రాధికా కూర్చున్న ఫోజుకి కుర్రాళ్లు మతులు పోయాయి. అసలు అనుపమా ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందని ఎవ్వరు ఊహించలేదని అంటున్నారు. అయితే.. ఈ పోస్టర్‌లోను ఫిబ్రవరి 9న టిట్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రానుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కానీ మళ్లీ ఇప్పుడు టిల్లుగాడు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాల్సి ఉంది. కానీ థియేటర్ల కారణంగా ఈగల్ సినిమాను టిల్లు స్క్వేర్ డేట్‌కు మార్చేస్తూ.. ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.
దీంతో టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదా పడినట్టేనని అంటున్నారు. దీంతో అసలు టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నల గడ్డ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ ఈ హిట్ సీక్వెల్‌తో హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అందుకే.. ఈ మధ్య మరో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు టిల్లుగాడితో పాటు ఫ్యాన్స్‌ను కూడా డిజప్పాయింట్ చేస్తోంది.