»Former Captain Rohit Sharma Fire On Mumbai Indians Captain Hardik Pandya Video Viral
Rohit Sharma: హార్దిక్ పాండ్యపై మాజీ కెప్టెన్ రోహిత్ ఫైర్.. వీడియో వైరల్
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Former captain Rohit Sharma fire on Mumbai Indians captain Hardik Pandya.. Video viral
Rohit Sharma: మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లతో మాట్లాడుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా వెనకనుంచి వచ్చి రోహిత్‌ను హగ్ చేసుకున్నాడు. దాంతో రోహిత్ వెంటనే వెనక్కి తిరిగి పాండ్యాతో చాలా సీరియస్‌గా మాట్లాడడం కనిపించింది. దానికి పాండ్యా ఏదో బదులు ఇచ్చినట్లు ఉంది. అక్కడే ఉన్న రషీద్‌ఖాన్, ఆకాశ్ అంబానీ సైతం వారి మాటలు వినీ ఆశ్చర్యపోయినట్లు కనిపించింది. అయితే ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుందని నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ముంబై ఇండియన్స్ అంటే కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తుకు వస్తాడు. మొత్తం నాలుగు సార్లు ట్రోఫీని అందించాడు. అయితే గత ఏడాది కాస్త తడబడ్డాడు. దీంతో రోహిత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది ముంబై. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యను వేలంలో దక్కించుకున్న ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతనికే జట్టు సారథ్య బాధ్యతలను కట్టబెట్టింది. దీంతో రోహిత్ అభిమానులు ఆ ఫ్రాంచైజీ మీద ఆగ్రహంగా ఉన్నారు. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో సైతం రోహితే మా కెప్టెన్ అంటూ ప్లకార్డులు దర్శనం ఇచ్చాయి. ఈ మ్యాచ్‌లో మంబై ఆరు వికెట్ల్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Rohit Sharma scolds Hardik Pandya for poor captaincy.