మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వశిష్ఠ కాంబోలో సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రవితేజకు వశిష్ఠ కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026 అర్ధభాగంలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట. కాగా, ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో, వశిష్ఠ ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు.