తెలంగాణ(telangana)లో కల్లుగీత కార్మికులకు(Geetha workers) గుడ్ న్యూస్. రైతు బీమా మాదిరిగా కల్లు గీత కార్మికులకు కూడా గీత కార్మికుల బీమా పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్(CM KCR) వెల్లడించారు. ఈ నేపథ్యంలో గీత కార్మికులు వారి విధుల్లో భాగంగా ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల బీమా వర్తించనుంది.
తెలంగాణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రకటించారు. అంతేకాదు అందుకు సంబంధించిన పత్రాలను రూపొందించాల్సిందిగా ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరారు.
గతంలో గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి చెట్లపైనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన దురదృష్ట సంఘటనలు చుశామని సీఎం(CM) అన్నారు. అటువంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నదని కేసీఆర్(KCR) అన్నారు.
ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమౌతున్నదని వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతు బీమా తరహాలోనే, కల్లు గీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు(cash) అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులు సహా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.