TPT: ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వయో వృద్ధులకు అవసరమైన సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది. దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను అందజేస్తారు. అర్హులైన వారు ధృవపత్రాలతో హాజరు కావలన్నారు.