NLG: నల్లగొండ సుందరయ్య కాలనీకి చెందిన టంగుటూరి ఎల్లయ్య(60), మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి రాగా, అక్కడ కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుమార్తె ఆదిమూలం మహాలక్ష్మి ఫిర్యాదు చేయగా, నార్కట్పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్లయ్య కూలి పని చేసేవాడు.