KMR: 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై అసెంబ్లీలో హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ ఏర్పాటు చేయకపోతే సభలో ఇదే విధంగా నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చలు జరిగేలా సభా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.