NZB: ధర్పల్లి మండలం చల్లాగర్గాలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000 జరిమానా విధిస్తామని సర్పంచ్ గాదె నరేష్ సోమవారం స్పష్టం చేశారు. మన ఊరి పిల్లల ఉజ్వల భవిష్యత్తు, ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామంలో ప్రత్యేకంగా ఫ్లెక్సీ తయారు చేయించి హెచ్చరిక జారీ చేశారు.