MHBD: తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామానికి చెందిన పూజారి సాయిలు (76) అనారోగ్య సమస్యల వల్ల ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న తొర్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.