కృష్ణా: మచిలీపట్నంలో ప్రజలకు త్రాగునీరు అందించేందుకు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన రెండు వాటర్ ట్యాంకర్లను మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.