SRD: కంగ్టి మండలం తడ్కల్ రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందని ఏఈవో హన్మండ్లు సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శాస్త్ర వేత్తలు నేరుగా రైతుల సందేహాలకు సమాధానాలిస్తారని పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ప్రతి వారం ఒక అభ్యుదయ రైతు తమ వ్యవసాయ అనుభవాలను, రైతులతో పంచుకొనే అవకాశం ఉంటుందన్నారు.